టౌన్‌హాల్ నిర్మాణానికి స్థలం పరిశీలన
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:47 AM
అద్దంకి పట్టణంలో ఎట్టకేలకు టౌన్‌హాల్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి.
అద్దంకి,జూలై24(ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో ఎట్టకేలకు టౌన్‌హాల్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి మేరకు ఆదాని కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 కోట్లతో భవానిసెంటర్‌లోని పాత రీడింగ్ రూమ్ స్థలంలో టౌన్ హాల్ నిర్మాణా నికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆదానీ కంపెనీ ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించారు. సుమారు 17 సెంట్ల స్థలంలో టౌన్‌హాల్ నిర్మాణం చేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్న పాత రీడింగ్ స్థలం వినియోగం లోకి రావడంతో పాటు పలు రకాల కార్యక్రమాలకు టౌన్‌హాల్ అందుబాటులోకి రానుంది. ప్రధానంగా పౌరాణిక కళా కారులకు పుట్టినిల్లుగా ఉన్న అద్దంకిలో ప్రదర్శన లకు సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్నారు. అదేసమయంలో స్వచ్చంధ సంస్థలు, సేవాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు కూడా కార్యక్రమాలు ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిం చుకోవాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో టౌన్‌హాల్ నిర్మాణం పై మం త్రి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆదానీ కంపెనీ చేపట్టే సేవా కార్య క్రమాలలో బాగంగా టౌన్‌హాల్ నిర్మాణం చేపట్టనున్నారు.