ఉగ్ర దాడికి నిరసనగా మౌనదీక్ష
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:08 PM
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా ఆదివారం పెద్దబస్టాండ్ సెంటర్లో టీడీపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడురోజుల సంతాపదినాల్లో భాగంగా మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం దారుణమన్నారు.
పొదిలి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా ఆదివారం పెద్దబస్టాండ్ సెంటర్లో టీడీపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడురోజుల సంతాపదినాల్లో భాగంగా మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం దారుణమన్నారు. కనిగిరి జనసేన సమన్వయ కర్త వరికూటి నాగరాజు మాట్లాడుతూ కాల్పులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇమాంసాహెబ్, యాసిన్, బొడ్డు సుబ్బయ్య, ముని శ్రీనివాసులు జనసేన నాయకులు హల్‌చల్ జహీర్ పాల్గొన్నారు.