షటిల్ విజేత విజయవాడ
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:05 PM
ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్‌కుమార్ మె మోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు ఆదివారం ముగిశాయి.
- ద్వితీయ స్థానంలో రేపల్లె
- ముగిసిన రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
ఒంగోలు, కార్పొరేషన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్‌కుమార్ మె మోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఒంగోలులోని హైదరీ క్లబ్‌లో ఈనెల 26, 27 తేదీలలో జరిగిన పోటీలలో పురుషుల విభాగం ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు బెంగళూరుకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో విజయవాడకు చెందిన హిమదీ్‌ప-వంశీలు ప్రథమస్థానంలో నిలవగా, రేపల్లెజట్టు హేమంత్-మునీర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మూడోస్థానం నెల్లూరు కైవసం చేసుకోగా, నాల్గో స్థానం విజయవాడ దక్కించుకుంది. ఈ మేరకు నిర్వాహకులు పీడీబీఏ జిల్లా కార్యదర్శి పావులూరి విజయ్‌కృష్ణ, కొమ్మినేని లక్ష్మణ్, యలవర్తి త్రిశంకర్‌రావు, యలవర్తి మల్లేశ్వరరావు, క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవు విజేతలను బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.12వేలు, నాల్గవ బహుమతి రూ.10వేలు అందజేశారు.