టీడీపీ నేతల ఇంట విషాదఛాయలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:18 AM
నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రో డ్డు ప్రమాదాలు ఇద్దరు టీడీపీ నేతల ఇంట విషాదాన్ని నింపాయి. ఈ రెండు సంఘటన ల్లో గుండ్లసముద్రం మాజీ సర్పంచ్ కొల్లా శ్రీరాములు కుమారుడిని పోగొట్టుకోగా, తంగె ళ్ల మాజీ ఎంపీటీసీ మాతంగి అచ్చమ్మ ఇరువురు మనుమళ్లను కోల్పోయారు.
ప్రమాదంలో అశువులు బాసిన ముగ్గురు యువకులు
బాధిత కుటుంబాలను పరామర్శించిన స్వామి
మర్రిపూడి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రో డ్డు ప్రమాదాలు ఇద్దరు టీడీపీ నేతల ఇంట విషాదాన్ని నింపాయి. ఈ రెండు సంఘటన ల్లో గుండ్లసముద్రం మాజీ సర్పంచ్ కొల్లా శ్రీరాములు కుమారుడిని పోగొట్టుకోగా, తంగె ళ్ల మాజీ ఎంపీటీసీ మాతంగి అచ్చమ్మ ఇరువురు మనుమళ్లను కోల్పోయారు. గుండ్లసము ద్రం గ్రామానికి చెందిన కొల్లా నాగార్జున(33) ఈనెల 22న సమీప బంధువుల ఇంట దశది న కర్మకు వెళ్లి వస్తుండగా సలకనూతల వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన ఒంగోలు, ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగార్జున శనివారంరాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆదివారం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించి గ్రామానికి తీసుకొచ్చారు. శ్రీరాములుకు ఇద్ద రు కుమారులు. పెద్దకుమారుడు ఐదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో మృతి చెందగా, మరో కు మారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న మంత్రి స్వా మి గ్రామానికి వెళ్లి నాగార్జున మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం తల్లిదండ్రుల ను ఓదార్చి ధైర్యం చెప్పారు. తంగెళ్ల ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మాతాంగి అచ్చమ్మ మనుమడు జడా డేవిడ్ క్రిస్మస్ రోజున జగ్గరాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందగా, మరో మనుమడైన మాతంగి రాఖి తీవ్రగాయాలతో గుంటూ రు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఇరువురు మనుమళ్లకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి స్వామి తంగెళ్లలో ఇద్దరి మృతదేహాలకు నివాళులర్పించి అచ్చమ్మ కుటుంబ స భ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి వెంట టీడీపీ నాయకులు రేగుల వీరనారాయణ, చేరెడ్డి నార్సారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుళ్లూరి నరసింహారా వు, గొంట హనుమారెడ్డి, లెక్కల భాస్కర్ చౌ దరి, రామక్రిష్ణంరాజు, కె.మోహన్‌రావ్, పొదిలి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.