మైనర్ కాలువలోకి మురుగునీరు మళ్లింపు
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:37 PM
దర్శి మైనర్ కాలువలోకి యథేచ్ఛగా మురుగునీటిని మళ్లిస్తున్నారు. అనేకచోట్ల మురుగుకాలువల్లోని నీటిని వదులుతుండటంతో సాగర్ జలాలు కలుషితం అవుతున్నాయి. పంటలసాగుకు దర్శి మైనర్ కాలువల ద్వారా విడుదలవుతున్న సాగర్‌జలాలు మురుగునీరు కలిసి కలుషితం అవుతుండటంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
దర్శి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): దర్శి మైనర్ కాలువలోకి యథేచ్ఛగా మురుగునీటిని మళ్లిస్తున్నారు. అనేకచోట్ల మురుగుకాలువల్లోని నీటిని వదులుతుండటంతో సాగర్ జలాలు కలుషితం అవుతున్నాయి. పంటలసాగుకు దర్శి మైనర్ కాలువల ద్వారా విడుదలవుతున్న సాగర్‌జలాలు మురుగునీరు కలిసి కలుషితం అవుతుండటంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు బ్రాంచ్ కాలువలో నుంచి ప్రారంభమైన దర్శి మైనర్ కాలువ దర్శి పట్టణం మధ్యలో నుంచి వెళుతుంది. దర్శిలో అనేక చోట్ల మురుగుకాలువల్లో నీటిని మైనర్ కాలువలోకి మళ్ళించారు. ఓహాస్పిటల్‌లోని మురుగును ప్రత్యేకంగా కాలువను ఏర్పాటుచేసి మళ్ళించారు. దీంతో కలుషితమైన సాగర్ జలాలు దుర్వాసన వెదజల్లుతుండటంతో పొలాల్లో నీరు పెట్టుకుంటున్న రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎంతోకాలంగా ఈతంతు కొనసాగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో క్రమేపి మరికొన్నిచోట్ల మురుగునీటిని మళ్ళించేందుకు కొత్తకాలువలు తీస్తున్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.