Share News

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై సీరియస్‌

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:39 AM

జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన 18మంది పంచాయతీ కార్యదర్శులు, సక్రమంగా పర్యవేక్షించని 12 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంపై సీరియస్‌

12 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 18మంది కార్యదర్శులకు డీపీవో షోకాజ్‌ నోటీసులు

మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిక

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన 18మంది పంచాయతీ కార్యదర్శులు, సక్రమంగా పర్యవేక్షించని 12 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇంటి పన్నుల వసూళ్లపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా ఏ రోజుకారోజు పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఆయా పంచాయతీల్లో నూరుశాతం ఆన్‌లైన్‌ ద్వారా పన్నులు వసూలు చేయాలని డీపీవో ఆదేశాలు జారీచేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా కొందరు కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై వివరణ కోరుతూ వారికి నోటీసులను జారీచేశారు మరోవైపు ఆయా మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేసి పన్నులు వసూలు చేయించాల్సి ఉంది. అయితే అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారికి కూడా నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో సీసీఏ రూల్స్‌ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో మార్కాపురం డివిజన్‌లో మర్రివేముల, వెలగలపాయ, గన్నేపల్లి, ముటుకుల, బోడపాడు, ఐటీవరం, భూపతిపల్లి, ఐటీవరం, గంగవరం, బోగోలు కార్యదర్శులు ఉన్నారు. ఒంగోలు డివిజన్‌లో దోసకాయలపాడు, బీమవరం, తురకపాలెం, శంకరాపురం పంచాయతీ కార్యదర్శులు, కనిగిరి డివిజన్‌లో మల్లవరం, పోలేపల్లి, చౌటపాలెం పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ

Updated Date - Dec 20 , 2025 | 01:39 AM