Share News

సెమీక్రిస్మస్‌ సందడి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:45 PM

చీరాల పట్టణంలో రెండు మూడు రోజులుగా దుకాణాల్లో కొనుగోళ్ల జోరు పెరిగింది.

సెమీక్రిస్మస్‌ సందడి

చీరాల, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి) : చీరాల పట్టణంలో రెండు మూడు రోజులుగా దుకాణాల్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకుల వేళ ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపు తున్నారు. వస్ర్తాలు, పిండి వంటలు, వివిధ రకాల సంబరాల్లో యువతీ యువకులు, చిన్నారులు, ప్రజలు ఉత్సాహంగానే పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పండుగ లు దగ్గర పడుతుండటంతో వస్త్రదుకాణాలు, ఎలక్ర్టానిక్స్‌ దుకాణాలు, కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలు కొనుగోళ్లుతో బిజీగా ఉంటున్నాయి.

ఈక్రమంలో చీరాల, వేటపాలెం, బాపట్ల, మార్టూ రు, పర్చూరు, చినగంజాం, దాదాపుగా పెదగంజాం వంటి ప్రాంతాల నుండి సైతం ప్రజలు చీరాలకు చేరుకుని కొనుగోళ్లు చేస్తున్నారు. ఆయా దుకాణాలు, ప్రధాన వీధులు వాహనాల రద్ధీ ఉంటోంది.

బల్లికురవ : క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాలలోని చర్చిలు ముస్తాభవుతున్నాయి. గురువా రం క్రిస్మస్‌ పండగ నేపథ్యంలో మండలంలోని వల్లాపల్లి, చెన్నుపల్లి, నక్కబొక్కలపాడు, బల్లికురవ, కొప్పెరపాడు, వైదన, అంబడిపూడి, గొర్రెపాడు, కూకట్ల పల్లి, కొణిదెన, ఉప్పుమాగులూరు, వెలమవారిపాలెం, కొత్తూరు, గుంటుపల్లి, మల్లాయపాలెం, సోమవర ప్పాడు తదితర గ్రామాలలో ఉన్న చర్చిలను క్రైస్తవులు మూడు రోజుల నుంచి ప్రత్యేక విద్యుత్‌ దీపాలతో ఆలంకరించారు. క్రిస్మస్‌ పండగ రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలు గ్రామాలలో సెమీక్రిస్మస్‌ వేడుకల ను చర్చిలలో ముందస్తుగా నిర్వహిస్తున్నారు.

పర్చూరు, : క్రీస్తు మార్గం అనుసరణీయమని పర్చూరు ఎస్సై జీవీ.చౌదరి అన్నారు. పర్చూరు పోలీసుస్టేషన్‌లో సోమవారం రాత్రి సెమీక్రిస్మస్‌ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ ప్రతిమతాన్ని గౌరవించి ఇరుగు పొరుగు వారితో శాంతియుత మార్గంలో పయనించాలన్నదే క్రీస్తు మార్గమన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్‌ పండుగను ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నిర్వహిం చుకోవడం అభినందనీయం అన్నారు. దైవ సేవకులు క్రిస్మస్‌ విశిష్టతను వివరించారు. అనంతరం కేక్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై పులి గోపి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నూతలపాడులో వేడుకలు...

పర్చూరు మండలం నూతలపాడులో నిర్వహించిన సెమీక్రిస్మస్‌ వేడుకల్లో తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ట్రైనీ ఎస్సై గోపీ, పీఏసీఎస్‌ చైర్మన్‌ విన్నకోట సతీష్‌ స్థానిక నేతలు పాల్గొన్నారు. అనంతరం కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకొల్లు : క్రిస్మస్‌ సమీపిస్తున్న నేపధ్యంలో మండలంలోని ఇంకొల్లు, హనుమోజిపాలెం, నాగండ్ల, భీమవరం, ఇడుపులపాడు తదితర గ్రామాలలో పరిధిలో చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్లలో విద్యుత్‌ వెలుగులతో స్టార్‌లను ఏర్పాటు చేశారు. ఇంకొల్లులో అంబేద్కర్‌నగర్‌, స్టాలిన్‌పేటలో భారీ స్టార్‌లను ఏర్పాటు చేశారు. ఇంకొల్లు అంబేద్కర్‌నగర్‌లో మంగళవారం రాత్రి సెమీక్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు.

అద్దంకి : నియోజకవర్గ స్థాయి సెమీ క్రిస్మస్‌ వేడుకలు బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కళ్యాణ మండపం లో నిర్వహించనున్నారు. సెమీక్రిస్మస్‌ వేడుకలకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం నియోజక వర్గంలోని ఫాస్టర్లకు మంత్రి రవికుమార్‌ దుస్తులు పంపిణీ చేయనున్నారు.

బల్లికురవ : స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం సెమీక్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్‌ కేక్‌ను ఎంపీడీవో కుసుమకుమారి, ఎంఈవోలు శ్రీనివాసరావు, రమేష్‌బాలు కట్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యాక్రమంలో ప్రిన్సిపల్‌ సరళకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:45 PM