Share News

పీడీసీసీబీ చైర్మన్‌గా సీతారామయ్య నేడు బాధ్యతలు

ABN , Publish Date - May 31 , 2025 | 02:17 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య శనివారం అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల పర్సన్‌ ఇన్‌చార్జిగా ఆయన పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం విదితమే.

పీడీసీసీబీ చైర్మన్‌గా సీతారామయ్య నేడు బాధ్యతలు

సభ్యుల నియామకం తర్వాత మరోసారి అట్టహాసంగా కార్యక్రమం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీబీ) పర్సన్‌ ఇన్‌చార్జి (చైర్మన్‌)గా డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య శనివారం అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల పర్సన్‌ ఇన్‌చార్జిగా ఆయన పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం విదితమే. ఆమేరకు ప్రభుత్వం అధికారికంగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సహకార శాఖ అధికారుల నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జిల్లాకు వచ్చాయి. దీంతో శనివారం బ్యాంకుకు వెళ్లి సీతారామయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. సింగిల్‌ విండోల్లో ముగ్గురు సభ్యులతో కమిటీలను నియమిస్తున్న ప్రభుత్వం సెంట్రల్‌ బ్యాంకుకు చైర్మన్‌తోపాటు ఆరుగురిని బోర్డు సభ్యులుగా నియమించాల్సి ఉంది. మిగిలిన సభ్యుల నియామకంపై తదుపరి ఉత్తర్వులు రానున్నాయి. ఆతర్వాత సీతారామయ్య... మంత్రులు, ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆహ్వానించి మరోసారి అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Updated Date - May 31 , 2025 | 02:17 AM