Share News

భద్రత డొల్ల

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:04 AM

ప్రైవేటు ట్రావెల్స్‌ వ్యవహారం ఇష్టారాజ్యంగా మారింది. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. నింబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్ట్‌ క్యారియర్లను స్టేజ్‌ క్యారియ ర్లుగా మార్చి నడుపుతున్నారు. అదేసమయంలో బస్సులలో కనీస సౌక ర్యాలు లేకుండా ఇష్టానుసారంగా టికెట్ల ధర పెంచి ప్రయాణికుల జేబు లు ఖాళీ చేస్తున్నారు.

భద్రత డొల్ల
కర్నూలులో ప్రమాదానికి గురైన ట్రావెల్స్‌ బస్సు

ప్రైవేటు ట్రావెల్స్‌ ఇష్టారాజ్యం

ప్రాణాంతకంగా మారుతున్న ప్రయాణం

తూతూమంత్రంగా రవాణా శాఖ తనిఖీలు

ఒంగోలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రైవేటు ట్రావెల్స్‌ వ్యవహారం ఇష్టారాజ్యంగా మారింది. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. నింబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్ట్‌ క్యారియర్లను స్టేజ్‌ క్యారియ ర్లుగా మార్చి నడుపుతున్నారు. అదేసమయంలో బస్సులలో కనీస సౌక ర్యాలు లేకుండా ఇష్టానుసారంగా టికెట్ల ధర పెంచి ప్రయాణికుల జేబు లు ఖాళీ చేస్తున్నారు. నైపుణ్యం లేని డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అతివేగంతో నడుపుతూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నారు. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు నడిపిన డ్రైవర్‌ తప్పిదం వల్లే 20మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. అతివేగంతో వెళుతూ ముందున్న మోటారు బైకిస్టును ఢీకొట్టడం ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న తర్వాతైనా రవాణాశాఖ మేల్కొనాల్సి ఉంది. మిగతా బస్సులన్నా నిబంధనలకు లోబడి నడుస్తున్నాయా లేదా పరిశీలించాల్సి ఉంది. బస్సులో మండే స్వాభావం ఉన్న వాటిని తరలించకూడదు. అయితే వోల్వో బస్సులలో కింద ర్యాకులలో బైకులు, గ్యాస్‌ సిలిండర్లు లాంటి వస్తువులను రవాణా చేయడం సర్వసాధారణమైపోయింది. ఇంకా దూరప్రాంతాలకు వెళ్లే లగేజీలలో అనేక పదార్థాలు ఉంచి క్యారియర్‌లో పెడుతున్నారు. ఇలాంటి వాటి వలన ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 202 కాంట్రాక్ట్‌ క్యారియర్లు, 101 ఆర్టీసీకి అద్దె బస్సులు నడుస్తున్నాయి. అద్దె బస్సులను నిబంధనలు ప్రకారం ఆర్టీసీ పర్యవేక్షణ చేస్తుంటుంది. అయితే కాంట్రాక్ట్‌ క్యారియర్‌ పేరుతో జిల్లాలో 202 సర్వీసులు ఉండగా ఇంకా వందల సంఖ్యలో బస్సులు జిల్లా మీద నుంచి వెళుతుంటాయి. అయితే రవాణా శాఖ ప్రైవేటు బస్సుల మీద దృష్టిసారించడం లేదు. వాటిపై నిఘా ఉంచి తనిఖీలు చేయడం, ఫిట్‌నెస్‌ తదితరాలు ఉన్నాయా? లేదా? పరిశీలించాల్సి ఉంది. కానీ నిబంధనలకు తుంగలో తొక్కి ట్రావెల్స్‌ బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే అధికారులు చోద్యం చూడటం గమనార్హం

Updated Date - Oct 25 , 2025 | 01:04 AM