సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:14 PM
సచివాలయ ఉద్యో గులు సమయపాలన పాటించడం లేదు. గంటలకొద్దీ ఆలస్యంగా కార్యాలయాలకు తాపీగా వస్తూ విధి ని ర్వహణలో మమ అనిపించుకుంటూ పోతున్నారు.
కార్యాలయాల వద్ద ప్రజల పడిగాపులు
పీసీపల్లి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యో గులు సమయపాలన పాటించడం లేదు. గంటలకొద్దీ ఆలస్యంగా కార్యాలయాలకు తాపీగా వస్తూ విధి ని ర్వహణలో మమ అనిపించుకుంటూ పోతున్నారు. వివి ధ సేవల కోసం సచివాలయాలకు వెళ్తున్న ప్రజలకు తాళాలు కూడా తీయకుండా తలుపులు వేసి ఉండడం కనిపిస్తుంది. దీంతో ఉద్యోగుల రాక కోసం ప్రజలు సచివాలయాల వద్ద గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తుంది. సోమవారం ముద్దపాడు సచివాలయానికి వివిధ సేవల కోసం పెద్దన్నపల్లి, వాకంవారిపల్లి, ముద్దపాడు గ్రామాలకు చెందిన ప్రజలు సచివాలయం వద్దకు వెళ్లారు. అక్కడ సచివాలయం తలుపులు కూడా తీయకుండా తాళంవేసి ఉంది. 11గంటల వరకు ఎదురుచూసినా ఉద్యోగులు రాలేదు, సచివాలయం త లుపులూ తీయలేదు. 11.18గంటల సమయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రభుత్వ పాఠశాలలో విధులు చూసుకుని వచ్చి సచివాలయం తలుపులు తీశారు. వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ సమయానికి వచ్చినప్పటికీ సచివాలయం తెరిచేందుకు తాళాలు లేక ప్రజలతో పాటు వారు బయటకూర్చున్నారు. గతంలోనూ మండలంలోని పలు సచివాలయాల ఉద్యో గులు సమయపాలన పాటించడంలేదన్న ఫిర్యాదులు అందడంతో అప్పటి ఎంపీడీవో ప్రభాకరశర్మ రోజూ సచివాలయాలను విజి ట్ చేశారు. అప్పట్లో కొంతకాలం విధులకు సమయపాలన పాటించిన ఉద్యోగులు ఇటీవల ఎంపీడీవో బదిలీపై వెళ్లారు. తిరిగి పాత పద్ధతిని ఉద్యోగులు అనుసరిస్తూ సమయపాలన పాటించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.