Share News

కొనకనమిట్ల ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌, కామటి సస్పెన్షన్‌!

ABN , Publish Date - Dec 03 , 2025 | 01:47 AM

కొనకన మిట్ల సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ వార్డెన్‌ ఎం.శివశంకర్‌ తోపాటు కామటిగా పనిచేస్తున్న లక్ష్మీదేవిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

కొనకనమిట్ల ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌, కామటి సస్పెన్షన్‌!

పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే కారణం

ఒంగోలు నగరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కొనకన మిట్ల సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహ వార్డెన్‌ ఎం.శివశంకర్‌ తోపాటు కామటిగా పనిచేస్తున్న లక్ష్మీదేవిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు కలెక్టర్‌ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం హాస్టల్‌ విద్యార్థులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో అలమటిస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఇళ్లకు వెళ్లిపోయారంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్‌ వార్డెన్‌ పర్యవేక్షణ లోపాన్ని గుర్తించారు. కామటి నిర్లక్ష్యంపైనా నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఇద్దరిపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 01:47 AM