ఎస్సీ, ఎస్టీసబ్ ప్లాన్ నిధులను సమర్థంగా వినియోగించాలి
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:25 PM
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ కార్యక్రమం అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు, స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం ఎస్సీ, ఎస్టీకాంపోనెంట్ ప్లాన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆ కార్యక్రమం అమలు వాస్తవ స్ఫూర్తితో వినియోగించాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు, స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం ఎస్సీ, ఎస్టీకాంపోనెంట్ ప్లాన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయిలో ఆయాశాఖల వారీగా ఖర్చు పెట్టిన విధానాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొన్ని శాఖలు లక్ష్యాలకు దూరంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీనవర్గాల అభివృద్ధి, వారి ఆవాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి మెరుగుపర్చాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తుందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిఽధులను ఖర్చు చేయాలన్నారు. వచ్చే సమావేశం నటికి నిధుల వినియోగంలో స్పష్టమైన మార్పు రావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి వరలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్‌నాయక్‌తో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.
లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీకి ఆమోదం
జిల్లాలోని సముద్రతీర మత్య్సకారులకు పీఎంఎంఎ్‌సవై పథకం ద్వారా ఎంపికైన చేసిన లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయాలని జిల్లా స్థాయికమిటీ సమావేశంలో ఆమోదించారు. కలెక్టర్ రాజాబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. కొత్తపట్నం మండలం పల్లెపాలేనికి చెందిన మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్, జీపీఎస్ సెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లామత్స్యశాఖ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, జిల్లా అధికారులైన కమిటీ సభ్యులు బి. చిరంజీవి, ఎస్. శ్రీనివాసరావు, వరలక్ష్మీ, టి.నారాయణ, రమేష్, ఎల్‌డీఎం సుధాకర్, జిల్లామత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పేరయ్య తదితరులు ఉన్నారు.