Share News

ఎస్బీ కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి.. వైసీపీ నాయకుడు కత్తితో బెదిరింపులు

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:43 PM

ఒంగోలు నగర పరిధిలోని పె ళ్లూరులో నివాసం ఉంటున్న స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ ఎం.వెంకటరావు ఇం టికి వెళ్లిన వైసీపీ నాయకుడు కత్తితో బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన సో మవారం జరిగింది.

ఎస్బీ కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి..  వైసీపీ నాయకుడు కత్తితో బెదిరింపులు

అరెస్టు చేసిన పోలీసులు

రిమాండ్‌ విఽధించిన కోర్టు

ఒంగోలు క్రైం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగర పరిధిలోని పె ళ్లూరులో నివాసం ఉంటున్న స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ ఎం.వెంకటరావు ఇం టికి వెళ్లిన వైసీపీ నాయకుడు కత్తితో బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన సో మవారం జరిగింది. స్థానిక పెళ్లూరులో నివాసం ఉంటున్న వెంకటరావు ఇంటికి అదే గ్రామానికి చెందిన బొడ్డు జగన్‌ కత్తి తీసుకొని వెళ్లాడు. ఆ సమయంలో వెంకటరావు లేరు. ఆయన భార్య మాత్రమే ఉన్నారు. దీంతో జగన్‌ ఇంటి త లుపు నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి మీ భర్తను చంపి ముక్కలుముక్కలుగా నరుకుతా అంటూ హెచ్చరించాడు. వినాయక చవితి సందర్భంగా జగన్‌ను పో లీస్‌స్టేషన్‌లో బైండోవర్‌ చేయాలంటూ వెంకటరావు సమాచారం ఇచ్చారని తె లుసుకుని కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూసి న జగన్‌ గుండాయిజానికి దిగాడు. ఇకడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలం టూ హుకుం జారీ చేశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన కానిస్టేబుల్‌ వెం కటరావు భార్య ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడు. అయితే అప్పటికే అక్కడ నుంచి జగన్‌ పరారీ అయ్యాడు. ఈమేరకు ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి జ గన్‌ను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అత డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Updated Date - Oct 21 , 2025 | 11:43 PM