Share News

సోలార్‌తో విద్యుత్‌ ఆదా చేసుకోవాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 10:44 PM

సోలార్‌ ఏర్పా టుతో విద్యుత్‌ ఆదా జరుగుతుందని డీఈ ఆర్‌. ఉమా కాంత్‌ అన్నారు.

సోలార్‌తో విద్యుత్‌ ఆదా చేసుకోవాలి
సైకిల్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి

కనిగిరి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): సోలార్‌ ఏర్పా టుతో విద్యుత్‌ ఆదా జరుగుతుందని డీఈ ఆర్‌. ఉమా కాంత్‌ అన్నారు. సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌, స చ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూటమి శ్రేణులు, నాయకులు, మన్సిపల్‌ అధికారులతో కలసి శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ, మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఉమాకాంత్‌ మాట్లాడుతూ ప్రతి విని యోగదారుడు సబ్సిడీతో సోలార్‌ ఏర్పాటుచేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలన్నారు.

మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో జరిగిన సైకిల్‌ ర్యాలీని మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిఒ క్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు. ప్రతిఒక్క రూ గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్‌ కవ ర్‌ల వినియోగాన్ని విడ నాడాలని సూచించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌ మాట్లాడు తూ కూటమి ప్రభు త్వంలో ఎమ్మెల్యే డాక్ట ర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో పచ్చద నం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పా రు. అనంతరం రైతుబజార్‌ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, అధికారులు, కూటమి నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, అహ్మద్‌, నజిముద్దీన్‌, యారవ శ్రీను, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 10:44 PM