Share News

వైభవంగా సత్యసాయి జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:46 PM

సత్యసాయిబాబా శతవర్ష జ యంతి ఉత్సవాలు స్థానిక ప్రేమసుధా మందిరంలో అత్యంత వైభవంగా జరిగా యి. 5 రోజులుగా జరుగుతున్న జయం తి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

వైభవంగా సత్యసాయి జయంతి ఉత్సవాలు
పేదలకు దుస్తులను అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతవర్ష జ యంతి ఉత్సవాలు స్థానిక ప్రేమసుధా మందిరంలో అత్యంత వైభవంగా జరిగా యి. 5 రోజులుగా జరుగుతున్న జయం తి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణబాబు, ఎం ఈవోలు అశ్వనీకుమార్‌, నాగభూషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులు ముత్తుముల క్రిష్ణకిశోర్‌రెడ్డి, పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, సత్యసాయి సేవాసమితి కన్వీనర్‌ సూరె అనంతరామయ్య, అమ్మవారిశాల అధ్యక్షుడు వాడకట్టు రంగసత్యనారాయణ పాల్గొని పూజలు నిర్వహించారు. సత్యసాయి బోధనల గురించి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వివరించారు. పేదలకు నూతన వస్త్రాలను, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అందచేశారు. కాగా బీజేపీ నాయకులు సైతం సత్యసాయి జయంతి ఉత్సవాలలో పా ల్గొని పూజలు నిర్వహించారు. మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులందరికీ సత్యసాయి సేవాసమితి సమకూర్చిన దుస్తులను కమిషనర్‌ రమణబాబు అందచేశారు. జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రేమసుధా మందిరంలో సామూహిక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : ప్రేమ తత్వమే మానవత్వమని సమానత్వమే సత్యసాయి తత్వమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఎన్‌ఎ్‌స నగర్‌లోని భాగవన్‌ సత్యసాయి మందిరంలో బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై సత్యసాయి బాబా చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. సత్యసాయి సేవా సమితి, భక్తులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో భగవాన్‌ సత్యసాయి బాబా శత జయం తి ఉత్సవాలు నిర్వహించారు. కమిషనర్‌ డీవిఎస్‌ నారాయణ రావు, కౌన్సిలర్‌ నాలి కొండయ్య పాల్గొన్నారు.

తర్లుపాడు : సత్యసాయి చిత్రపటానికి తహసీల్దార్‌ కేకే కిషోర్‌కుమార్‌, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ చరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీరెడ్డి, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

రాచర్ల : సత్యసాయి బోధలు అం దరూ ఆచరించాలని ఎంపీడీవో వెంకట రామిరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నాయకులతో కలిసి సత్యసాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో స్వామి, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజ్‌ కుమార్‌, ఎఫ్‌ఏ లక్ష్మీనారాయణ, రాష్ట్ర గ్రీనింగ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ యోగానంద్‌, కాశిరెడ్డి, సనావుల్లా ఖాన్‌ పాల్గొన్నారు.

పెద్దారవీడు : పుట్టపర్తి సాయిబాబా సేవాతత్పరత ఆచరణీయమని ఎంపీడీవో జాన్‌సుందరం అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం సత్యసారు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

త్రిపురాంతకం : సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్‌కుమార్‌ గ్రామ పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపీణీ చేశారు. సత్యసాయి చిత్రపటానికి పూల మాలవేసి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో వెలుగు, ఉపాధిహామీ, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కంభం : సత్యసాయి జయంతి వేడుకలను ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఈవో పసుపులేటి రంగయ్య, కార్యదర్శి రమేష్‌ రెడ్డి, పంచాయితీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం రూరల్‌ : సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సర్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శివప్రసాద్‌, వీఆర్వోలు నాసర్‌వలి. రాంబాబు, సత్యనారాయణ, పొతులూరయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణా, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రత్నం పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : సత్యసాయి మందిరంలో తహసీల్దారు అశోక్‌ కుమార్‌ రెడ్డి పంచాయతీ కార్మికులకు దుస్తులను పం పిణీచేశారు. కార్యక్రమంలో వీఆర్‌వో ఏ డుకొండలు, సంస్థ సభ్యులు శేఖర్‌, రంగారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 10:46 PM