ఘనంగా సత్యసాయి శతజయంతి
ABN , Publish Date - Nov 24 , 2025 | 02:09 AM
భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు.
పర్చూరు, నవంబరు 23 (ఆంఽధ్రజ్యోతి) : భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబా జయంతిని నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. ఆదివారం పర్చూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆమ్మవారి ఆలయంలో నిర్వహించిన సత్యసాయిబాబా శతజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవసేవే మాధవసేవ అనే నినాదంతో సేవా కార్యక్రమాలు చేపట్టి బాబా విశ్వవ్యాప్తం అయ్యార న్నారు. ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ కారుమంచి వెంకటకృష్ణరావు(కృష్ణ) మాట్లా డుతూ విద్యా, వైద్య, ఆధ్యాత్మిక తదితర రంగాల్లో వారు చేపట్టిన సేవలు నేటికీ కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ముస్లీం కార్పోరేషన్ చైర్మన్ షేక్.షంషుద్దీన్ మాట్లాడుతూ అనంతరపురం జిల్లాకు తాగునీరు అందించిన ఘనత సత్యసాయి బాబాకే దక్కుతుంద న్నారు. విద్యా, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవ చిరస్మరణీయం అని కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శకుంతల, ఈవోఆర్‌డీ హరిప్రసాద్, ఆర్యవైఽశ్య సంఘ నాయకులు మామిడిపాక హరిప్రసాద్, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు కనమర్లపూడి కృష్ణమోహన్, సత్యసాయి బాబా ట్రస్ట్ ప్రతినిధి హనుమంతురావు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
అద్దంకిటౌన్ : సత్య సాయిబాబా శతజయంతిని ఆదివారం గాంధీబొమ్మ కూడలిలోని సత్య సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం సత్యసాయిబాబా చిత్రపటంతో భక్తులు, మహిళలు పాల్గొని నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం మందిరంలో పల్లకి సేవ, భజన కార్యక్రమం నిర్వహిం చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వరూధిని, ఎంఈవో కెవి శ్రీనివాసరావు, సత్యసాయిబాబా మందిరం కన్వీనర్ చిన్ని శ్రీహరిరావుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలు నిర్వహించారు.
వేటపాలెం(చీరాల) : ప్రతి మానవుడు ఆధ్యాత్మిక చింతనతో ముందు సాగాలని తద్వారా, ఆనందరం, ఆరోగ్యం సాధ్యమని వేటపాలెం ఎంపీడీవో రాజేష్‌బాబు అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో సత్యసాయి బాబా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వెంక టేశ్వర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చినగంజాం : స్థానిక సత్యసాయి మందిరంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఆదివారం సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. మందిరంలో సత్య సాయిబాబా చిత్రపటానికి పూల మాలలు వేసి, ప్రత్యేక పూజలు అనంతరం సాయిబాబా సహస్ర నామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి సభ్యులు వంద మంది పేదలకు చీరలు, దుప్ప ట్లు పంపిణీ చేశారు. పూజల అనంతరం నారాయణ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి మండల కన్వీనర్ మాజేటి శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక కన్వీనర్ రామసుబ్బారావు, ఆధ్యాత్మిక మహిళ కన్వీనర్ వేదాల లక్ష్మి, సమితి సభ్యులు మాజేటి లక్ష్మిప్రసన్న, బొమ్మిశెట్టి బాల కోటేశ్వరగుప్త, తుమ్మల పెంట ముసలయ్య పాల్గొన్నారు.