సారా ప్రాణానికి హానికరం
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:13 PM
సారా ప్రాణానికి హానికరమని మార్కాపురం ఎక్సైజ్ సీఐ ఎం.వెంకటరెడ్డి అన్నారు. పట్టణ, మండల పరిధిలోని పలు మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మార్కాపురం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సారా ప్రాణానికి హానికరమని మార్కాపురం ఎక్సైజ్ సీఐ ఎం.వెంకటరెడ్డి అన్నారు. పట్టణ, మండల పరిధిలోని పలు మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నవోదయం 2.0లో భాగంగా సారా నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సారా వలన ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. శివారు కాలనీలు, కొన్ని గ్రామాల్లో సారా విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఎక్కడైనా విక్రయాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే గంజాయి విక్రయాలు చేయడం నేరమన్నారు. ఎక్కడైనా గంజాయి అమ్మినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలోని రాయవరం, గజ్జలకొండ మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.