సంకల్ప-2026ను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలి
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:12 PM
ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్ప-2026ను ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని గుంటూరు జోన్ విద్యాశాఖ ఆర్జేడీ జే పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
కనిగిరి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్ప-2026ను ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని గుంటూరు జోన్ విద్యాశాఖ ఆర్జేడీ జే పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను అనుసరించి ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరించి పరిక్షల విధానం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వం కళాశాలల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. మెరుగైన ఫలితాలను సాధించి 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పెరిగేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. అనంతరం కళాశాలలోని రికార్డులను పరిశీలించారు. సైన్స్‌ల్యాబ్‌ను సందర్శించి మధ్యాహ్నభోజన వసతులను పరిశీలించారు. ఆర్జేడీ వెంట ప్రిన్సిపాల్ పోలంరెడ్డి రమణారెడ్డి, అఽధ్యాపకులు కుమ్మరకుంట సురేష్, సీహెచ్ చెన్నకేశవులు, పద్మజ, రవీంద్ర, హనుమంతరావు, రామరాజు, కోటి సాహెబ్, వెంకటరాజు, గురవమ్మ, నాగమణి, ప్రమోద్, వెంకటసురేష్, మార్తమ్మ, మహబూబ్‌బాషా, సాయి తదితరులు పాల్గొన్నారు.