Share News

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:01 AM

‘ఉలిచి గ్రామ పంచాయతీలో పారిశు ధ్యం అధ్వానంగా ఉంది. పంచాయతీ కార్య దర్శిగా ఏమి చేస్తున్నావు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోం ది’’ అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ హె చ్చరించారు.

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలి

మ్మెల్యే దామచర్ల

ఉలిచి పంచాయతీ కార్యదర్శి తీరుపై

అసహనం

పలు గ్రామాల్లో సుపరిపాలను తొలిఅడుగు

ఒంగోలు(రూరల్‌), జూలై16 (ఆంధ్రజ్యో తి): ‘‘ఉలిచి గ్రామ పంచాయతీలో పారిశు ధ్యం అధ్వానంగా ఉంది. పంచాయతీ కార్య దర్శిగా ఏమి చేస్తున్నావు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోం ది’’ అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ హె చ్చరించారు. బుధవారం ఒంగోలు మండలం ఉలిచి, బీవీపాలెం, దేవరంపాడు ఎస్సీకాలనీ పంచాయతీ, దేవరంపాడు, గుండాయిపాలెం గ్రామాల్లో జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మొ దటగా ఉలిచి గ్రామంలో పర్యటించిన ఆయ న రోడ్లపై చెత్తాచెదారం, పారిశుధ్యం అధ్వా నంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశా రు. దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుతూ పారిశుధ్యం ఇంత అధ్వానంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆ దేశించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అరంతకం బొద్దులూరివారిపాలెంలో పర్యటిం చిన ఎమ్మెల్యే దామచర్లకు చప్పిడి శేషయ్య మాట్లాడుతూ గ్రామంలో నుంచి ఉలిచి చెక్‌ డ్యామ్‌ వరకు తారురోడ్డు నిర్మించాలని విజ ్ఞప్తి చేశారు. తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు చే యాలని కోరారు. జగనన్న కాలనీలో మూడు ఇళ్లు మాత్రమే నిర్మించారని, మిగిలిన స్థలా లు పేదలకు మంజూరు చేయాలన్నారు.

డ్వాక్రా నిధులు స్వాహా చేశారు..

దేవరంపాడు ఎస్సీ గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలన తొలిఅడుగులో ఎమ్మె ల్యే జనార్దన్‌ పాల్గొని గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా గ్రూపు మహిళలు తమ గోడు వె ళ్లబోసుకున్నారు. పాత బుక్‌కీపర్‌ వడ్డీతో కలి పి రూ.50లక్షలు స్వాహా చేశారంటూ ఫిర్యా దు చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే డీఆర్‌ డీఏ పీడీతో ఫోన్‌ చేసి మాట్లాడారు. వెంటనే రికార్డులు తనిఖీ చేసి నిధులు రికవరీ చేసి కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవా లని చెప్పారు.

అమ్మకు వందనం రాలేదు..

గుండాయపాలెంోని మత్స్యకార విద్యార్థు లకు అమ్మకువందనం నగదు బ్యాంక్‌ ఖాతా లకు జమకాలేదంటూ ఎమ్మెల్యే దామచర్లకు గ్రామస్థులు విన్నవించుకున్నారు. వెంటనే ఆ యన సంబంధిత అధికారులకు తగిన ఆ దేశాలు ఇచ్చారు. గ్రామంలో వీఽధి దీపాలు వె లిగేలా చూడాలని సిబ్బందికి సూచంచారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్య క్షుడు జి.శ్రీనివాసులు, నలమోతు బాల గంగాధర్‌, వలేటి రాంబాబు, పటాన్‌హనీఫ్‌ ఖాన్‌, పిల్లుట్ల సుధాకర్‌, చుంచు శేషయ్య, వై.నరసింహారావు, వై.వెంకటశేషయ్య, చుం చు శింగయ్య, నన్నపనేని వెంకట్రావు, య ర్రా అంజయ్య, చుంచు రామాంజనేయులు, కాటి అంజియ్య, చప్పిడి శేషయ్య, గల్లా సు రేష్‌, అనుదీప్‌, యార్లగడ్డ అశోక్‌, కొక్కెలగడ్డ ప్రభాకర్‌, కొక్కెలగడ్డ కోటేశ్వరరావు, కొమ్ము చంటి, కనుమూరి ఏలియా, అంగా నాగేం ద్రం, శింగోతు మామయ్య, శింగోతు వెంకటే శ్వర్లు, ఏడుకొండలు, ముప్పవరపు శ్రీనివాస రావు, మాలంపాటి యానాదినాయుడు, గద్దె వెంకటకృష్ణ, పాలేటి ప్రభాకర్‌, పులిచర్ల మో హన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:01 AM