Share News

శానిటరీ సెక్రటరీలు ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందే !

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:39 AM

నగరంలో పారిశుధ్యం మెరుగు పరి శీలన, ఇంటింటి చెత్త సేకరణపై ప్రతి సెక్రటరీ ప్రతి ఇంటికీ వెళ్ళి పరిశీలించాలని కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు.

 శానిటరీ సెక్రటరీలు ప్రతి ఇంటికీ వెళ్లాల్సిందే !

కమిషనర్‌ వెంకటేశ్వరరావు

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 23 (ఆంధ్ర జ్యోతి): నగరంలో పారిశుధ్యం మెరుగు పరి శీలన, ఇంటింటి చెత్త సేకరణపై ప్రతి సెక్రటరీ ప్రతి ఇంటికీ వెళ్ళి పరిశీలించాలని కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. బుధవారం స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయలో శానిటరీ సె క్రటరీలలో సమీక్ష నిర్వహించిన ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యంపై ప్రతిరో జు డీఎంఏ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి నివేదికలు కోరుతున్నాయని చెప్పారు. అంతేగా కుండా ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజలతో నే రుగా మాట్లాడి శానిటేషన్‌ గురించి అడిగి తె లుసుకుంటున్నారని పేర్కొన్నారు. సచివాలయ సెక్రటరీల బదిలీలు పూర్తయి, డివిజన్ల కేటా యింపు కూడా జరిగి పదిరోజులు దాటిందని, అందువల్ల అందరూ ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజ లతో మాట్లాడి నూతనంగా వచ్చిన శానిటరీ సెక్రటరీగా తెలియపరుచుకోవాలన్నారు. ప్రతిరో జు ఇంటింటి చెత్త సేకరణ, కాలువల శుభ్రం జరగాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్‌ హెచ్చరించారు. అలాగే డివిజన్‌లలో పిచ్చి మొక్కలు కూడా తొ లగించాలన్నారు. కార్మికులు బాధ్యతతో పనిచే యించాలని ఆదేశించారు. సమావేశంలో హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వైష్ణవి, శానిటరీ సూపర్‌వైజర్లు, షేక్‌ బాబ్జి, నూకతోటి పిచ్చయ్య, శానిటరీ సె క్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:40 AM