Share News

టీచర్ల బకాయిలకు మోక్షం

ABN , Publish Date - Aug 17 , 2025 | 02:35 AM

జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం నిర్వహణకు సంబంధించి బిల్లుల చెల్లిం పులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ‘బకాయిలకు మోక్షమెప్పుడో’ శీర్షికతో ఈనెల 8న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పథకానికి స్పందించిన విద్యాశాఖాధి కారులు బిల్లులను బ్యాంకులకు, ఖజానా కార్యాలయాలకు సమర్పించారు.

టీచర్ల బకాయిలకు మోక్షం

రూ.91.79 లక్షలకు బిల్లుల సమర్పణ

ఒంగోలు విద్య, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం నిర్వహణకు సంబంధించి బిల్లుల చెల్లిం పులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ‘బకాయిలకు మోక్షమెప్పుడో’ శీర్షికతో ఈనెల 8న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పథకానికి స్పందించిన విద్యాశాఖాధి కారులు బిల్లులను బ్యాంకులకు, ఖజానా కార్యాలయాలకు సమర్పించారు. సోమవారం ఉదయం నుంచి ఉపాధ్యాయుల ఖాతాలకు డబ్బులు జమకానున్నాయి. రూ.18.76 లక్షలు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా, రూ.73.03 లక్షల బిల్లులు జిల్లా ఖజానా కార్యాలయానికి సమర్పించారు. మార్చిలో జరిగిన పబ్లిక్‌ పరీక్షల రెమూనరేషన్‌ రూ.8.57లక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల రెమ్యూనరేషన్‌ రూ.3.45 లక్షలు, కన్వీనియన్స్‌ అలవెన్స్‌(సీఏ) రూ.88వేలు, టీఏ, డీఏలు రూ.3.55 లక్షలు, కంటింజెన్సీ రూ.2.81 లక్షలు మొత్తం రూ.18.76 లక్షలు బ్యాంకులకు పంపారు. ఈ మొత్తం బ్యాంకులో సిద్ధంగా ఉండటంతో బకాయిలు వెంటనే టీచర్ల ఖాతాలకు జమ కానున్నాయి. ఖజానా కార్యాలయానికి పంపిన ఫుల్లీ ఓచర్డ్‌ (ఎఫ్‌వీ) రూ.73.03 లక్షల్లో రెమ్యూనరేషన్‌, టీఏ, డీఏ, సీఏ, కంటిజెన్సీ బిల్లులను ఖజానా శాఖ అధికారులు మంజూరు చేస్తారు. ఈ మొత్తాలు సీఎంఎఫ్‌ఎస్‌ ద్వారా టీచర్ల ఖాతాలకు జమకానున్నాయి.

Updated Date - Aug 17 , 2025 | 02:35 AM