గొట్టిపాటి హనుమంతరావు ఎత్తి పోతల పథకానికి మోక్షం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:05 PM
మండలంలోని చిలకలేరు వాగుకు సమీపంలో పోలవరం రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన గొట్టిపాటి హనుమంతరావు ఎత్తి పోతల పథకం కొన్ని సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకం కింద పోలవరం గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి 805 ఎకరాలు బీడు భూములుగా మారాయి. దీంతో టీడీపీ దర్శి నియోజక వర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులను ఈనెల 7వ తేదీన రైతులు కలిసి తమ గ్రామానికి జీవనాధారమైన మాజీ మంత్రి, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు ఎత్తి పోతల పథకం మూలనబడిన విషయాన్ని వారి దృష్టికి తీసుకు వచ్చారు.
మొదలైన జంగిల్ క్లియరెన్స్ పనులు
టీడీపీ ఇన్‌చార్జ్ లక్ష్మీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన పోలవరం గ్రామస్థులు
ముండ్లమూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని చిలకలేరు వాగుకు సమీపంలో పోలవరం రైతుల శ్రేయస్సు కోసం నిర్మించిన గొట్టిపాటి హనుమంతరావు ఎత్తి పోతల పథకం కొన్ని సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకం కింద పోలవరం గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి 805 ఎకరాలు బీడు భూములుగా మారాయి. దీంతో టీడీపీ దర్శి నియోజక వర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులను ఈనెల 7వ తేదీన రైతులు కలిసి తమ గ్రామానికి జీవనాధారమైన మాజీ మంత్రి, స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు ఎత్తి పోతల పథకం మూలనబడిన విషయాన్ని వారి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఐడీసీ అధికారులతో ఎత్తి పోతల పథకం మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్న విషయం తెలిపారు. ఐడీసీ అధికారులు మరమ్మతులు చేయటానికి గాని, ట్రాన్స్‌ఫార్మర్ అమర్చటానికి గాని తమ వద్ద నిధులు లేవని, రైతులే భరించాల్సి ఉంటుందని చెప్పారు. వెంటనే స్పందించి డాక్టర్ లక్ష్మి, లలిత సాగర్ దంపతులు ఎత్తి పోతల పథకం ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మరమ్మతులకు అయ్యే 20 లక్షల నిధులను తాము సొంతంగానే భరించి పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లోనే బుధవారం ఎత్తి పోతల పథకం వద్ద చిల్లచెట్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. ఇక పనులు ప్రారంభం కావటంతో గ్రామస్థులు ప్రత్యేకంగా లక్ష్మీ, లలిత సాగర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.