ఘనంగా హనుమాన్ సాయి మందిర వార్షికోత్సవం
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:22 AM
మండలంలోని నక్కబొక్కలపాడులో ఉన్న హనుమాన్‌సాయి మందిర 19వ వార్షికో త్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
బల్లికురవ, నవంబరు17(ఆంద్రజ్యోతి): మండలంలోని నక్కబొక్కలపాడులో ఉన్న హనుమాన్‌సాయి మందిర 19వ వార్షికో త్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయిమందిరంలో తెల్లవారు జాము నుంచే ప్రత్యక హారతులు, అహా షేకాలను ఏర్పాటు చేశారు. అర్చక స్వామి ఇంకొల్లు మధు, సుధీర్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నక్కబొక్కల పాడు గ్రామంలో పాటు బల్లికురవ, కొత్త పాలెం, గుంటుపల్లి, అంబడిపూడి, చెన్నుపల్లి, కొండాయపాలెం, కొణిదెన, నాగరాజుపల్లి, మల్లాయపాలెం గ్రామాల నుంచి భక్తులు కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని సాయి బాబాను, అంజనేయస్వామిని దర్శించుకొన్నా రు. కార్తీకమాసం కావడంతో మహిళ భక్తులు దేవాలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లిం చుకున్నారు. గ్రామస్ధులు సమష్టి కృషితో దాతల సహకారంతో సుమారు రూ. 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు.
మంత్రి రవికుమార్ ప్రత్యేక పూజలు
నక్కబొక్కలపాడు హను మాన్‌సాయి మందిరంలో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. స్వామివారిపై విశ్వాసంతో పలుమార్లు ఈ దేవాలయంలో సాయి బాబాను దర్శించుకున్నారు. ఈసందర్భంగా అయనకు దేవాలయ కమిటీ సాదర స్వాగతం పలికింది. ప్రతి ఒక్కరు దైవ మార్గంలో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దూళిపాళ్ల హనుమంత రావు, నీటి సంఘం అధ్య్యక్షులు దర్శి రామస్వామి, డీసీ వైస్ చైర్మన్ కోయ పేరయ్య, సోసైటీ అద్యక్షులు గొట్టిపాటి లక్ష్మయ్య, నేతలు మలినేని గోవిందరావు, శంకర్, మాలపాటి పోతురాజు తదితరులు పాల్గొన్నారు.