కొండపికి సాగర్ నీరు
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:31 AM
కొండపి నియోజకవర్గంలో ప్రత్యేకించి ముసి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో తాగు, సాగునీటికి కొంత ఊరట కలగనుంది. వర్షాధారమే ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి వనరు కాగా ఏటా సరైన వర్షాలు లేక పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు.
నియోజకవర్గంలో తాగు, సాగు కోసం 0.60 టీఎంసీలు
మంత్రి స్వామి విజ్ఞప్తితో ప్రభుత్వం ఉత్తర్వులు
ఒంగోలు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : కొండపి నియోజకవర్గంలో ప్రత్యేకించి ముసి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో తాగు, సాగునీటికి కొంత ఊరట కలగనుంది. వర్షాధారమే ఆ ప్రాంతంలో సాగు, తాగునీటి వనరు కాగా ఏటా సరైన వర్షాలు లేక పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యా మ్నాయంగా సాగర్ నీటిని ఒంగోలు బ్రాంచి కాలువ నుంచి ముసి నదికి ఇవ్వడం ద్వారా తన నియోజకవర్గంలోని వాగు పరివాహక ప్రాంత ప్రజలు తాగునీటి ఇక్కట్ల నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు. ఆయన వినతిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఓబీసీపై రామతీర్థం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వెలుగువారిపాలెం సమీపంలో ఉన్న 23.17 కి.మీ వద్ద ఎస్కేప్ నుంచి ముసికి 0.60 టీఎంసీల నీరు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు పభ్రుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రామతీర్థం రిజర్వాయర్ నిండి ఒంగోలు బ్రాంచి కాలువలో నీరు సరఫరా బాగా ఉన్న సమయంలో ఈ నీటిని ముసికి వదలాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. తగు చర్యలు తీసుకోవాలని ఒంగోలులోని ప్రాజెక్టు సీఈని ఆదేశించారు.