సురక్షిత ప్రయాణమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:08 PM
ప్రజలు, వాహనదారులు తమ గమ్యాలకు సురక్షితంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వం ద్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నా రు. ఎర్రగొండపాలెం మండల కేంద్రం నుంచి వెంకటాద్రిపాలెం గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరానికి మరమ్మతులకు రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి.
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
రూ.2కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన
ఎర్రగొండపాలెం రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు, వాహనదారులు తమ గమ్యాలకు సురక్షితంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వం ద్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నా రు. ఎర్రగొండపాలెం మండల కేంద్రం నుంచి వెంకటాద్రిపాలెం గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరానికి మరమ్మతులకు రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి. సోమవారం మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో ఆ పనులకు ఎరిక్షన్‌బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు ఎక్స్‌వేటర్‌ను నడిపి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లపై వాహనదారులు నరకం చూశారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత రోడ్ల బాగుకు చర్యలు తీసుకుందన్నారు. మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి పూనుకుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా గ్రామాలకు రోడ్లు వేశామన్నారు. ముందుగా పూరతన లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిట్యాల వెంగలరెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీశైలపతి నాయుడు, నలగాటి మల్లికార్జున నాయుడు, కంచర్ల సత్యనారాయణ గౌడ్, ఎంసీహెచ్ మంత్రు నాయక్, తోట మహేష్ నాయుడు, పేరం రమణారెడ్డి, చేవుల ఆంజయ్య, నలగాటి శివ, టీడీపీ నాయకులు, ఆర్‌ఆండ్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.