Share News

సురక్షిత ప్రయాణమే లక్ష్యం

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:35 PM

సురక్షితే ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని జిల్లా ప్రజారవాణశాఖ అధికారి(డీపీటీవో) సత్యనారాయణ అన్నారు.

సురక్షిత ప్రయాణమే లక్ష్యం
విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న డీపీటీవో సత్యనారాయణ, డీఎం షయానాబేగం

డీపీటీవో సత్యనారాయణ

విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణం

పీసీపల్లి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): సురక్షితే ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని జిల్లా ప్రజారవాణశాఖ అధికారి(డీపీటీవో) సత్యనారాయణ అన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. గు రువారం యిర్లపాడులో ఆర్టీసీ బస్సు ఎక్కిన సత్యనా రాయణ లక్ష్మక్కపల్లి, లింగన్నపాలెం, అక్కడినుంచి బోడవాడ వరకు విద్యార్థులతో కలిసి ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమాలు, రోడ్డుభద్రతా చర్యలు, సురక్షిత ప్రయా ణంపై అవగాన కల్పించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చిన్నవయసులోనే ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కలిగి ఉండడం ఎంతోఅవసరమన్నారు. ఆర్టీసీ బస్సుల లభ్యత, సమయపాలన, ప్రయాణ భద్రత తదితర అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. బస్సులో ప్రయాణిస్తున సమయంలో క్రమశిక్షణ పాటించాలన్నారు. డ్రైవర్‌, కండెక్టర్‌లకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకూడదని విద్యార్థులకు హి తవు పలికారు. విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్‌, కండెక్టర్‌లకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో రవాణా భ ద్రతపై అవగాహన పెంచడమే కా కుండా ప్రభుత్వ పధకాలు వారికి చేర వేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని డీపీటీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజరు మహ్మద్‌ షయానాబేగం, రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:35 PM