రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:29 PM
ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీ ఓబాయిపల్లి సెల్ టవర్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
ఇద్దరికి గాయాలు
తర్లుపాడు, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీ ఓబాయిపల్లి సెల్ టవర్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కలుజువ్వలపాడు నుంచి నాతనంపల్లి వెళ్తున్న తంగిరాల కాశయ్య బైకు, కొండారెడ్డిపల్లి నుంచి కలుజువ్వలపాడు వెళ్తున్న నాగం శివ బైకును ఢీకొట్టింది. దీంతో శివ బైకుపై వెనుక కూర్చున్న వెంకటస్వామి (68) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శివకు తీవ్ర గాయాలు కాగా.. తంగిరాల కాశయ్యకు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆటోలో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన వెంకట స్వామికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి వెళ్లారు.