Share News

రెండు బైక్‌ల ఢీ.. ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:10 AM

పొదిలి మండలంలోని మాదిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి రెండు బైకులు ఎదురెదురు ఢీకొన్నాయి.

రెండు బైక్‌ల ఢీ.. ముగ్గురికి గాయాలు

పొదిలి, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మాదిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి రెండు బైకులు ఎదురెదురు ఢీకొన్నాయి. కొనకనమిట్ల మండలం మునగపాడుకు చెందిన శివ టైలర్‌పని చేసుకుంటూ పొదిలిలో నివాసం ఉంటా స్వగ్రామం వెళ్లి తిరిగి పొదిలి వస్తున్న క్రమంలో కొనకనమిట్ల గ్రామానికి చెందిన అఖిల్‌, రవి అనే యువకులు మోటార్‌ బైకుపై వస్తున్నారు. మాదిరెడ్డిపాలెం దగ్గరకు వచ్చే సరికి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో శివ పాదం నుజ్జునుజ్జు కావడంతోపాటు చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శివను ఒంగోలు తరలించినట్లు డాక్టర్‌ శివపార్వతి తెలిపారు. అఖిల్‌, రవిల ఇద్దరికి ఒకరికి మోకాలు, ఒకరికి చేయికి గాయాలు కావడంతో చికిత్స చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:11 AM