Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:17 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కారంచేడు అంబేద్కర్‌ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కారంచేడు - పర్చూరు రోడ్డులో ఘటన

కారంచేడు/పర్చూరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కారంచేడు అంబేద్కర్‌ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన వేముల శివయ్య(57) మృతి చెందాడు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించుకుంటున్న శివయ్య చీరాల నుంచి తన స్వగ్రామం నూతలపాడు ద్విచక్రవాహనంపై వెళుతూ వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. క్షతగ్రాత్రున్ని 108 వాహనం ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కారంచేడు పోలీసుల కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, కుమార్తె కుమారుడు ఉన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:17 PM