రోడ్డు ప్రమాదంలో ఆదాయపన్నుశాఖ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:30 PM
రోడ్డు ప్రమాదంలో ఇన్‌కంట్యాక్స్ ఉద్యోగి మృతిచెందిన ఘటన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చోటుచేసుకొంది.
పంగులూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఇన్‌కంట్యాక్స్ ఉద్యోగి మృతిచెందిన ఘటన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 8 గంటల సమయంలో చోటుచేసుకొంది. పోలీసుల సమాచారం మేరకు ఇన్‌కంటాక్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దాసరి కృష్ణచైతన్య(46) స్కూటీపై ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్నాడు. మండలంలోని జాగర్లమూడివారిపాలెం వద్ద ఫ్లై ఓవర్ దిగే క్రమంలో వేగంగా డివైడర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో డివైడర్ పక్కన కృష్ణచైతన్య విగతజీవుడై పడి ఉండగా స్కూటీ కొద్దిదూరంలో పడిఉంది. ఎస్.ఐ. వినోద్‌బాబు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.