లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
ABN , Publish Date - May 14 , 2025 | 11:38 PM
లారీ, మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన జరిగింది.
గిద్దలూరు టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి): లారీ, మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన జరిగింది. అందిన సమాచారం మేరకు బుధవారం గిద్దలూరు మండలం దంతెరపల్లి సమీపంలో లారీ, బైకు ఎదురుగా వస్తూ ఢీకొనడంతో కడప జిల్లా కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లెకి చెందిన గంగరాజు (32) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గిద్దలూరు అర్భన్ సీఐ సురేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.