Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:24 AM

దశాబ్దాల నుండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోని పలు రోడ్లకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడంతో అవి కొత్తరూపును సంతరించుకున్నాయి.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

అద్దంకి, డిసెంబరు11 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల నుండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోని పలు రోడ్లకు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడంతో అవి కొత్తరూపును సంతరించుకున్నాయి. దీంతో రాక పోకలకు అడ్డంకులు తొలగాయి. వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్ట లేదు. దీంతో గోతులు మరింత పెరిగి రాకపోకలకు తీ వ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టి నాబార్డ్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా సుమారు రూ.40.50 కోట్ల నిధులు కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రూ.1.20 కోట్లతో గోవాడ రోడ్డు, రూ.1.20 కోట్లతో సజ్జాపురం రోడ్డు, రూ.3 కోట్లతో చెన్నుపల్లి-వైదన రోడ్డు, రూ.1,44 కోట్లతో మేదరమెట్ల-తమ్మవరం రోడ్డు, రూ.1.20 కోట్లతో తిమ్మనపాలెం-యర్రబాలెం రోడ్డు, రూ.80 లక్షలతో జాతీయరహదారి నుంచి పి.గుడిపాడు రోడ్లు పూర్త య్యాయి. మండలంలోని శాంతినగర్‌- ఏలేశ్వరవారి పాలెం వరకు రూ.5.10 కోట్ల, బల్లికురవ మండలంలో వి.కొప్పెరపాడు నుంచి జమ్మలమడ క రోడు రూ. 4.75 కోట్లతో పనులు చేపడుతున్నారు. శ్రీరామ్‌నగర్‌- కొటికలపూడి - పార్వతీపురం రోడ్డుకు రూ.1.50 కోట్లు, కొటికలపూడి-తిమ్మారెడ్డిపాలెం రోడ్డుకు రూ.1.50 కోట్లు, తిమ్మాయపాలెం-రామాయపాలెం రోడ్డుకు రూ.30 లక్షలు వైదన రోడ్డుకు రూ.75 లక్షలు, జార్లపాలెం- చెరువుకొమ్ముపాలెం రోడ్డుకు కోటి రూపాయలు, ఏల్చూరు నుంచి సజ్జాపురం రోడ్డుకు రూ.2.50 కోట్లు కర్రవానిపాలెం నుండి తూర్పు తక్కెళ్లపాడు రోడ్డుకు రూ.40 లక్షలు, రేణింగవరం-అలవలపాడు రోడ్డుకు రూ.2,80 కోట్లు, కొండమంజులూరులో కోటి రూపాయలు, చందలూరు-గంగవరం రోడ్డుకు రూ.2 కోట్లు, వేమవరం-కె.రాజుపాలెం రోడ్డుకు రూ.90లక్షలు, చవిటిపాలెం నుండి కోటవారిపాలెం రోడ్డుకు రూ.60లక్షలు ఏల్చూరు- అడవిపాలెం రోడ్డుకు రూ. 80 లక్షలు మంజూర య్యాయి. ఆయా రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభిం చేందుకు సిద్ధం చేస్తున్నారు. అద్దంకి నియోజక వర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ ఉన్న కీలకమైన రోడ్లను తారు రోడ్లుగా మారుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలలో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated Date - Dec 12 , 2025 | 12:24 AM