పశ్చిమంపై పాలకుల నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:45 AM
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంపై దశా బ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలి
వెలిగొండను త్వరగా పూర్తి చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
మార్కాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంపై దశా బ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు జాతి సంపదలైన ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తూ కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిం చాలన్నారు. వెలిగొండను వేగవంతంగా పూర్తి చేయా లని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేవీ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు అందె నాసరయ్య, ఎస్‌కే ఖాసిం పాల్గొన్నారు.