Share News

రోడ్ల నిర్మాణానికి రూ.7కోట్ల నిధులు

ABN , Publish Date - May 03 , 2025 | 10:26 PM

గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారపేట మండలాల్లో పూర్తిగా దెబ్బతిన్న రహదారుల నిర్మాణానికి రూ.7కోట్ల నాబార్డ్‌ నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

రోడ్ల నిర్మాణానికి  రూ.7కోట్ల నిధులు
ఛిద్రమైన నాగులవరం - అర్ధవీడు రోడ్డు

అర్ధవీడు (కంభం), మే 3 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం, బేస్తవారపేట మండలాల్లో పూర్తిగా దెబ్బతిన్న రహదారుల నిర్మాణానికి రూ.7కోట్ల నాబార్డ్‌ నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రధాన రహదారులన్నీ మరమ్మతులకు నోచుకోకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రాళ్లు తేలిన ఈ రహదారుల్లో ప్రయాణం చేయడం నరకంగా ఉందని, రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరడంతో తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నాబార్డ్‌ నిధులు రూ.7 కోట్లు మంజూరు చేయించానన్నారు. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామం నుంచి వెలగలపాయ వరకు 3.50 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1.50కోట్లు, కంభం మండలం యర్రబాలెం గ్రామం నుంచి అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురం గ్రామం వరకు 4.10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1.50 కోట్లు, బేస్తవారపేట మండలం కోనపల్లె నుంచి సీతారామపురం 19.11 కిలోమీటర్ల నిర్మాణం కోసం రూ.4కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 10:26 PM