రోడ్ల అభివృద్ధికి రూ. 61.48 కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:24 AM
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.61.48 కోట్లు మంజూరయ్యాయి. ఈమేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని రాష్ట్రీయ రహదారులు 56.77 కి.మీ అభివృద్ధికి రూ.31 కోట్లు, ప్రధాన రోడ్లు 63.78కి.మీ అభివృద్ధికి రూ.30.48 కోట్లు కేటాయించారు.
వాటిలో రాష్ట్రీయ, ప్రధాన రహదారులు
పలు నియోజకవర్గాలకు కేటాయింపు
ఒంగోలు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.61.48 కోట్లు మంజూరయ్యాయి. ఈమేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని రాష్ట్రీయ రహదారులు 56.77 కి.మీ అభివృద్ధికి రూ.31 కోట్లు, ప్రధాన రోడ్లు 63.78కి.మీ అభివృద్ధికి రూ.30.48 కోట్లు కేటాయించారు. రాష్ట్ర రహదారుల విభాగంలో ఒంగోలు డివిజన్ పరిధిలోని వావిలేటిపాడు-కామేపల్లి-కొండపి రోడ్డు 12కి.మీ అభివృద్ధికి రూ.3.50 కోట్లు, సంతనూతలపాడు మండలం లోని నాయుడుపాలెం రోడ్డు 8 కి.మీ అభివృద్ధికి రూ.3.50 కోట్లు మంజూరు చేశారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని గిద్దలూరు నియోజకవర్గంలో మూడు రోడ్ల అభివృద్ధికి రూ.3కోట్లు, మార్కా పురం-పొదిలి రోడ్డు 5.71 కి.మీ అభివృద్ధికి రూ.4కోట్లు ఇచ్చారు. ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం రోడ్డు 15.49 కి.మీ అభివృద్ధికి రూ.7కోట్లు, కనిగిరి డివిజన్ పరిధిలో కనిగిరి-డీజీపేట రోడ్డులో 4.70 కి.మీ అభివృద్ధికి రూ.5.50 కోట్లు, పొదిలి-వినుకొండ రోడ్డు దర్శి నియోజకవర్గ పరిధిలో 9.14 కి.మీ అభివృద్ధికి రూ.5కోట్లు మంజూర య్యాయి. ఇక ఒంగోలు డివిజన్ పరిధిలోని ఒంగోలు నియోజకవ ర్గంలో రెండు ప్రధాన రోడ్లు 11.60 కి.మీ అభివృద్ధికి రూ.3.95 కోట్లు, కొండపి పరిధిలో రెండు పనులకు రూ.6.33కోట్లు, సంతనూతలపాడు పరిధిలో రెండు ప్రధాన రోడ్లకు రూ.6కోట్లు, కనిగిరి నియోజకవ ర్గానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. వీటిలో సింగరాయకొండ, పామూరు పట్టణాల్లోని ప్రధాన రోడ్లు కూడా ఉన్నాయి.