Share News

పరిశ్రమలకు రూ.3.25 కోట్ల రాయితీ మంజూరు

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:13 AM

జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లైయిమ్‌లకు రూ.3.25 కోట్ల రాయితీని మంజూరు చేసినట్లు కలెక్టర్‌ అన్సారియా తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశ్రమలకు రూ.3.25 కోట్ల రాయితీ మంజూరు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

కలెక్టర్‌ అన్సారియా వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 3 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లైయిమ్‌లకు రూ.3.25 కోట్ల రాయితీని మంజూరు చేసినట్లు కలెక్టర్‌ అన్సారియా తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను గడువు తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ర్యాంప్‌ పథకంపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పీఎంఈజీపీ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన దరఖాస్తులను వెంటనే బ్యాంకులకు పంపించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక వేత్త కార్యక్రమానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి శ్రీనివాసరావు, ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, నాబార్డు డీడీఎం రవికుమార్‌, ఎల్‌డీఎం రమేష్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మదన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 01:13 AM