ఆటో డ్రైవర్లకు రూ.15వేలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:16 AM
ఆటో డ్రైవర్లకు అడగకుండానే కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.10వేలు అందజేసింది. అయితే ఇటీవల రాష్ట్రంలో స్త్రీశక్తి పఽథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టారు.
జిల్లాలో 12,091 మంది గుర్తింపు
12,423 దరఖాస్తులు, 326 తిరస్కరణ
హోల్డ్‌లో ఆరు దరఖాస్తులు
4న లబ్ధిదారుల ఖాతాలలో నగదు జమ
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లకు అడగకుండానే కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.10వేలు అందజేసింది. అయితే ఇటీవల రాష్ట్రంలో స్త్రీశక్తి పఽథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం వారికి భరోసా కల్పించేందుకు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఆన్‌లై న్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లావ్యా ప్తంగా 12,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు వివిధ కారణాలతో 326మంది దరఖాస్తులను తిరస్కరించారు. ఆరింటిని హోల్డ్‌లో ఉంచారు. మొత్తం 12,091 మంది ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఎంపిక చేశారు. వారికి ఈనెల 4న బ్యాంక్ ఖాతాలలో రూ.15వేల చొప్పున జమ చేయనున్నారు.
గతం కంటే ఎక్కువ...
లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24లో కేవలం 10,741 మంది లబ్ధిదారులకు మాత్రమే వాహన మిత్ర పథకం అమలు చేశారు. అప్పట్లో ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం లబ్ధిని రూ.15వేలకు పెంచి 12,091 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రజాప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎలాంటి హామీ ఇవ్వకుండా వాహనమిత్ర పథకం అమలు చేస్తోంది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారుల జాబితా తయారీకి క్షేత్రస్థాయిలో యంత్రాంగం సూక్ష్మ పరిశీలన చేసింది. గ్రామ సచివాలయం నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన యంత్రాగం లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలించి మండల స్థాయిలో జాబితాలు తయారు చేశారు. ఈ జాబితాలను స్వయంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు. అయితే ఎంపిక అంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో మంగళవారం నుంచి లబ్ధిదారుల జాబితా ఉంచినట్లు చెబుతున్నారు.