నేడు రోటరీ కళా పరిషత్ నాటిక పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:42 PM
శ్రీకారం స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు ఆధ్వర్వంలో గురువారం రాత్రి స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో శ్రీకారం రోటరీ కళా పరిషత్ నాటిక పోటీలను ప్రారంభిస్తున్నట్లు శ్రీకారం సంస్థ కార్యదర్శి జాష్టి అనూరాధ, రోటరీ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు.
మార్టూరు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : శ్రీకారం స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు ఆధ్వర్వంలో గురువారం రాత్రి స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో శ్రీకారం రోటరీ కళా పరిషత్ నాటిక పోటీలను ప్రారంభిస్తున్నట్లు శ్రీకారం సంస్థ కార్యదర్శి జాష్టి అనూరాధ, రోటరీ అధ్యక్షుడు మద్దుమాల కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 నాటికలను ప్రదర్శిస్తారు. గురు, శుక్ర, శనివారాలు నాటికలను ప్రదర్శిస్తారు.ప్రదర్శించిన ప్రతి నాటికకు పారితోషికంతో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేస్తారు. దాంతోపాటు వ్యక్తిగత బహుమతులను కళాకారులకు అందచేస్తారు. ఈ నాటిక పోటీలను రోటరీ గవర్నర్ జిల్లా 3150 డాక్టరు కే శరత్‌చౌదరి ప్రారంభిస్తారని, ఆత్మీయ అతిథులుగా వేదిక ఉపాధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు విచ్చేస్తారన్నారు. అదేవిధంగా పోటీలను ప్రారంభిస్తూ రాత్రి మొదటిగా న్యూస్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారిచే కపిరాజు నాటిక, రెండో ప్రదర్శనగా రసఝురి పొన్నూరు వారిచే గురితప్పినవేట నాటిక, యంగ్ థియేటర్ విజయవాడ వారిచే 27వ మైలురాయి నాటికను ప్రదర్శిస్తారు. చివరగా రోటరీ కళాపరిషత్ సభ్యులతో 50కోట్లు నాటికను ప్రదర్శిస్తారు. ప్రదర్శనల కోసం రంగస్థల కళా వేదికను సిద్ధం చేశారు. అదేవిధంగా నాటికల ప్రదర్శనలను తిలకించిన మహిళలకు ప్రత్యేక బహుమతులుగా చీరలను లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారికి నిర్వాహకులు అందజేయనున్నారు.