Share News

ఆర్టీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇంట్లో చోరీ

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:23 PM

ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పొదిలి బ్రహ్మయ్య ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి సుమారు రూ.లక్ష సొత్తు చోరీ చేశారు.

ఆర్టీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఇంట్లో చోరీ
బీరువాను పగులకొట్టి చిందరవందరగా పడేసిన వస్తువులు

ఒంగోలు క్రైం, జూలై18(ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పొదిలి బ్రహ్మయ్య ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి సుమారు రూ.లక్ష సొత్తు చోరీ చేశారు. ఈ సంఘటన స్థానిక మామిడిపాలెంలో గల కరణం గారి వీధిలో శుక్రవారం వెలుగుచూసింది. బ్రహ్మయ్య తన భార్యతో కలిసి ఈనెల 16న హైదరాబాద్‌ వెళ్ళారు. శుక్రవారం ఉదయం వచ్చేసరికి ఇంటి తాళం పగలకొట్టి బీరువా పెకలించి ఉంది. రూ.55 వేల నగదు, ఒక బంగారం ఉంగరం, రెండు వెండి వస్తువులు దొంగలు అపహరిచుకెళ్ళినట్లు వారు గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు బ్రహ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:23 PM