వర్షాలకు రోడ్లు ఛిద్రం
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:23 PM
మొంథా తుఫా న్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ఛిద్ర మయ్యాయి. దీంతో రవాణా రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కనిగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే జాతీయ, ఆర్‌అండ్‌బీ రోడ్లలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి.
వాహన చోదకులు పడరాని పాట్లు
ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు
కనిగిరి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫా న్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ఛిద్ర మయ్యాయి. దీంతో రవాణా రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కనిగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే జాతీయ, ఆర్‌అండ్‌బీ రోడ్లలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. గుంతలలో వర్షపు నీరు నిలబడి రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనచోదకులకు ఇబ్బంది గా మారి నానా అవస్థలు పడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకో లేదు. కనీసం తట్ట మట్టిపోసిన దాఖలాలు లేవు. దీంతో రోడ్లపై చాలాచోట్ల గుంతలు ఏర్పడి ఇబ్బందిగా మారిం ది. పట్టణ సమీపంలోని కనిగిరి నుంచి పొదిలి వెళ్ళే 565 జాతీయ రహదారి రోడ్డులో కాశిరెడ్డి కాలనీ, దే వాంగనగర్ వద్ద వర్షాలకు రోడ్డుపై ఉన్న గుంతల లో నీరు నిలిచి రోడ్డుంతా కోసుకుపోయింది. కనిగి రి నుంచి కొత్తూరు మీదుగా పామూరు వైపు వెళ్ళే 565జాతీయ రహదారి రోడ్డంతా పాడైంది. కనిగిరి నుంచి తాళ్ళూరు, గుడిపాడు వెళ్ళే రోడ్డు అధ్వానం గా మారింది.- కనిగిరి నుంచి సీఎస్‌పురం డీజీపేట వెళ్ళే 14, 15, 16కి.మీ వద్ద రోడ్డు మార్గం వర్షాలకు తారు లేచిపోయి గుంతలు పడ్డాయి. ఊళ్ళపాలెం - వే ములపాడు (ఓవీ రోడ్డు)లోని చినఇర్లపాడు, ఏబీఆర్ కళాశాల, కస్తూర్భాగాంధీ స్కూల్, శంఖవరం, ఫైర్ స్టేషన్, ఆర్టీసీ డిపో డౌన్ రోడ్డంతా పెద్ద గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే, మొగళ్ళూరు -వేములపాడు రోడ్డులోని 92కి.మీ వద్ద, నాగిరెడ్డిపల్లి- మారంరెడ్డిపల్లి మార్గంలో 81, 82, 83 కి.మీ వద్ద రోడ్డంతా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వాటి లో నీరు నిలిచి వాహనాల రాకపోకలక, ప్రజలకు, వా హన చోదకులకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమ యాల్లో రోడ్డుపై పడిన గుంతలు కనిపించక ప్రమా దాలు జరుగుతున్నాయి.
రోడ్ల దుస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించాం
జి.సంజీవకుమార్, ఆర్‌అండ్‌బీ డీఈ, కనిగిరి
ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రోడ్లు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వాటిని పరిశీలించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్న డివిజన్ పరిధిలోని వివిధ రోడ్లకు సుమారు రూ.2 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపాం. వాటితో మరమ్మత్తులు చేపడతాం.