Share News

అధ్యాపకుల మధ్య రగడపై ఆర్‌జేడీ సీరియస్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:34 AM

కొమరోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుల రగడపై గుంటూరు ఆర్‌జేడీ పద్మజ సీరియస్‌ అయ్యారు. ‘అధ్యాపకుల పోరు.. విద్యార్థులు ఏమౌతారో’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై స్పందించిన ఆమె సోమవారం ఆర్‌ఐవో రామాంజనేయులుతో కలిసి కళాశాలకు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు.

అధ్యాపకుల మధ్య రగడపై ఆర్‌జేడీ సీరియస్‌
అధ్యాపకులను విచారిస్తున్న ఆర్జేడీ పద్మజ

కొమరోలు కళాశాలలో విచారణ

ఐదుగురిపై తాత్కాలిక చర్యలు

కొమరోలు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కొమరోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుల రగడపై గుంటూరు ఆర్‌జేడీ పద్మజ సీరియస్‌ అయ్యారు. ‘అధ్యాపకుల పోరు.. విద్యార్థులు ఏమౌతారో’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై స్పందించిన ఆమె సోమవారం ఆర్‌ఐవో రామాంజనేయులుతో కలిసి కళాశాలకు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. రాతపూర్వకంగా వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. ప్రాథమికంగా కొన్ని అంశాలపై ఒక నిర్ధారణకు వచ్చారు. అధ్యాపకులు ఒకరిపై మరొకరు లేఖల ద్వారా కళాశాలను భ్రష్టుపట్టించారని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కళాశాలలో గొడవకు బాధ్యులైన ఐదుగురిపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. యూడీసీగా పనిచేస్తున్న కిషోర్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై ఉలవపాడుకు మార్చినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ, కెమిస్ర్టీ, కామర్స్‌ అధ్యాపకులు లోకేష్‌, సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌, హర్షవర్ధన్‌రెడ్డిని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

Updated Date - Sep 16 , 2025 | 02:34 AM