ఒడా చైర్మన్‌గా రియాజ్ నేడు ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:44 PM
ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్‌గా షేక్ రియాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భారీ ఏర్పాట్లు చే సిన జనసేన పార్టీ నేతలు
హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్‌గా షేక్ రియాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు, జనసేన పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ హాలులో రియాజ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన పార్టీ మంత్రులతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు భారీగా తరలిరానున్నారు.