Share News

డీసీసీబీలో విచారణపై హైకోర్టులో రిట్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 02:46 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరుగుతున్న సెక్షన్‌ 51 విచారణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణాధికారిగా నియమితులైన వి.గౌరీశంకర్‌ను మార్చాలని, అర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న పలువురు బ్యాంకు ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మార్చాలని పిటిషన్‌ దారులు హైకోర్టును ఆశ్రయించారు.

డీసీసీబీలో విచారణపై హైకోర్టులో రిట్‌

విచారణాధికారిని మార్చాలని పిటిషన్‌దారుల వినతి

ఒంగోలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరుగుతున్న సెక్షన్‌ 51 విచారణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణాధికారిగా నియమితులైన వి.గౌరీశంకర్‌ను మార్చాలని, అర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న పలువురు బ్యాంకు ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మార్చాలని పిటిషన్‌ దారులు హైకోర్టును ఆశ్రయించారు. పీడీసీసీ బ్యాంకు ఉమ్మడి జిల్లా పరిధిలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ పరిధిలో ఉన్న బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన రావి అంకమ్మ, జి.హరికృష్ణ అనే ఇరువురు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. పీడీసీసీబీలో గత వైసీపీ పాలనలో భారీగా అవినీతి, అక్రమాలు, అవకతవ కలు జరిగాయని.. వాటిపై విచారణ చేసి బాధ్యు లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు ప్రభుత్వా నికి చేరాయి. దీంతో త్రిసభ్య కమిటీతో విచారణ చేయించిన గత కలెక్టర్‌ అన్సారియా సెక్షన్‌ 51 విచారణకు సిఫార్సు చేశారు. అందుకోసం సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ వి.గౌరీశంకర్‌ను విచారణాధికారిగా నియమించారు. తొలుత ఆ ప్రతిపాదనకు జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధులు అంగీకరించ లేదు. పారదర్శక విచారణ కోసం మరో అధికారితో విచా రణ చేయించాలని సూచించారు. దాని వల్ల కొంత బ్రేక్‌ పడగా చివరకు గౌరీశంకర్‌నే నియమించారు. ఈ నెలలో రెండు విడతలు బ్యాంకుకు వచ్చిన ఆయన తూతూమంత్రంగా తప్ప సమగ్ర విచారణ, అక్రమార్కులపై చర్యలు తీసుకునే స్థాయిలో దృష్టిసారించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇక గతంలో బ్యాంకులో పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న అధికారులు కీలక స్థానాల్లో ఉండి విచారణను ముందుకు సాగని వ్వడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ రెండు అంశాలను పిటిషన్‌దారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి విచారణాధికారిని, బ్యాంకులో ఉన్న కొందరు అధికారులను మార్చాలని కోరారు. అప్పుడే పారదర్శక విచారణ సాధ్యమని విన్నవించారు. సదరు అధికారుల పేర్లను కూడా పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ఈ పిటిష న్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వం, సహకార శాఖ కమిషనర్‌, కలెక్టర్‌, డీసీవో, బ్యాంకు సీఈవోలతో పాటు ప్రస్తుత విచారణాధికారిగా ఉన్న గౌరీశంకర్‌ లను చేర్చారు. దసరా సెలవుల అనంతరం విచారణ జరగవచ్చని సమాచారం.

Updated Date - Sep 28 , 2025 | 02:46 AM