Share News

వరి.. వర్రీ

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:24 AM

రబీ సీజ న్‌లో సాగు చేసిన వరిపైరు చేతికందు తుందో, లేదోనని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఈనెలాఖరు వరకు మాత్రమే సాగునీటిని పంపిణీ చేస్తామని అధికారు లు ప్రకటించారు. ఆతర్వాత నీటి సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. దీంతో లేత వరిపైరు దక్కే పరిస్థితి కనిపించటం లేదు.

వరి.. వర్రీ
దర్శి బ్రాంచ్‌ కాలువలో అతితక్కువగా సరఫరా అవుతున్న నీరు

నెలాఖరుకు సాగర్‌ నీరు నిలిపివేత

దర్శి ప్రాంతంలో 5వేల ఎకరాల్లో సాగు

పంట చేతికందే సమయంలో తడులు అవసరం

ఆందోళన చెందుతున్న రైతులు

దర్శి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రబీ సీజ న్‌లో సాగు చేసిన వరిపైరు చేతికందు తుందో, లేదోనని రైతులు ఆందోళన చెందు తున్నారు. ఈనెలాఖరు వరకు మాత్రమే సాగునీటిని పంపిణీ చేస్తామని అధికారు లు ప్రకటించారు. ఆతర్వాత నీటి సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. దీంతో లేత వరిపైరు దక్కే పరిస్థితి కనిపించటం లేదు.

దర్శి ప్రాంతంలో రబీ సీజన్‌లో సుమారు ఐదువేల ఎకరాల్లో వరిపైరు సాగు చేశారు. ప్రస్తుతం ఆ పైరు కంకితీసే దశలో ఉంది. సుమారు నెలరోజులు సాగు నీరు సరఫరా చేస్తేనే ఆ వరి పైరు పండుతుంది. నె లాఖరుకు నీటిని నిలిపివేస్తామని అధికారులు ప్రక టించారు. దీంతో వేలాది రూపా యలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరిపైరు పంట చేతికందే సమయంలో నీరులేక ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా సాగర్‌ కాలువలకు నీటి సరఫరా అరకోరగా జరుగుతుంది. అన్నీ మేజర్లకు నీరు సక్రమంగా అందటం లేదు. చివరి ప్రాంతాలకు నీరు చేరటం లేదు. దీంతో ఆయకట్టు చివరి భూముల రైతులు ఆలస్యంగా వరిపైరు సాగు చేశారు. కొంతమంది రెండో పంట కింద రబీలో వరి నాట్లు వేశారు. కనీసం ఏప్రిల్‌ 15 వరకు నీరు సరఫరా చేస్తే అన్నీ పంటలు దక్కుతాయని రైతులు చెబు తున్నారు. ప్రస్తుతం కూడా సాగర్‌ కాలువలకు అరకొరగానే నీటిని విడుదల చేస్తున్నారు. అనేక మేజర్లకు ఇప్పుడు కూడా నీరు సక్రమంగా అందటం లేదు.

అధికారుల లెక్కల ప్రకారం సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు (ప్రకాశం బార్డర్‌) 1632 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 601 క్యూసెక్కులు, పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 361 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రస్తుతం విడుదలవుతుంది. ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు కనీసం 800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే అన్నీ మేజర్లకు నీరందుతుంది. కనీసం ఈచివరి దశలో నైనా మేజర్లకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తే పైర్లకు పుష్కలంగా నీరు పెట్టుకునే అవకాశం ఉంది.

అయితే, అధికారులు వారబందీ అమలుచేస్తున్నారు. దీంతో కొన్ని మేజర్లకు వారం రోజులు, మరికొన్ని మే జర్లకు అతర్వాత వారం నీరు విడుదలవుతుంది. ఈ లోపు మార్చి నెలాఖరు గడువు వస్తుండటంతో ముం దుగా కొన్ని మేజర్లకు నీరందే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుత్తం పంటల పరిస్థితి గుర్తించి అన్నీ పం టలు దక్కేలా ఏప్రిల్‌ 15 వరకు సాగర్‌ నీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:24 AM