చౌకగా బియ్యం, కందిపప్పు
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:16 AM
బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు అధికంగా ఉండటంతో వాటిని సామాన్యులకు తక్కువ ధరకు అందిం చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఒంగోలులో ముందుగా శనివారం ఒక విక్రయ కేంద్రాన్ని ప్రారం భించారు.
రైతు బజార్లలో విక్రయం
ఒంగోలు లాయర్‌పేటలో ప్రారంభించిన జేసీ
నేడు మరో రెండు కేంద్రాలు ప్రారంభం
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్ర జ్యోతి) : బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బియ్యం ధరలు అధికంగా ఉండటంతో వాటిని సామాన్యులకు తక్కువ ధరకు అందిం చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఒంగోలులో ముందుగా శనివారం ఒక విక్రయ కేంద్రాన్ని ప్రారం భించారు. ఆదివారం మరో రెండు కేంద్రాలను తెరవనున్నారు. రెండురోజుల క్రితం నిత్యా వసర ధరల నియంత్రణ కమిటీ సమావే శాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ నిర్వహించారు. బియ్యం, కందిపప్పు ధరలు బహిరంగ మార్కెట్లో అధికంగా ఉండటంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆ సందర్భంగా గుర్తించారు. దీంతో ముందుగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని మూడు రైతు బజార్లలో విక్రయాలు ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను జేసీ ఆదేశించారు. శనివారం లాయర్‌పేటలోని రైతు బజారులో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను జేసీ ప్రారంభించారు. దిబ్బలరోడ్డు, కొత్తపట్నం బస్టాండు వద్ద ఉన్న రైతు బజార్లలో ఆదివారం ఈ కేంద్రా లను ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.110 నుంచి రూ.120 వరకు ఉండగా... రైతుబజార్లలో కిలో రూ.100కే విక్రయించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.52 నుంచి 60 ఉండగా రైతుబజారులో ఒక రకం కిలో రూ.48, మరో రకం కిలో రూ.49కి అందుబాటులోకి తెస్తున్నారు. కందిపప్పు ఒక్కొక్కరికి అవసరమైతే రెండు కిలోలు కూడా ఇవ్వనున్నారు. బియ్యం బహిరంగ మార్కెట్లో 25 కిలోలు రూ.1,400కుపైగా ఉండగా రైతుబజారులో రూ.1,225కు విక్రయించనున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో పద్మశ్రీతోపాటు రైతుబజారు ఎస్టేట్ అధికారులు పాల్గొన్నారు.