రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:51 PM
రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవె న్యూ సమస్యలపై జరిగిన గ్రీవెన్స్‌లో ప్రజల నుం చి అర్జీలను స్వీకరించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పీసీపల్లి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మె ల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రెవె న్యూ సమస్యలపై జరిగిన గ్రీవెన్స్‌లో ప్రజల నుం చి అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, జాయింట్ ఎల్పీఎమ్‌లు, సర్వే సమస్యలు, రికార్డు సవరణలు, వారసత్వ హక్కు లు తదితర అంశాలను మండల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ సంబంధిత సమ స్యలపై సమీక్షించిన ఆయన వీటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సీహెచ్ ఉషకు సూచించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను వాయి దా వేయకుండా వేగంగా పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూశాఖపై ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం రెవెన్యూ సమస్యలను పరిష్క రించేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. తహసీ ల్ద్దార్ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యే లా చూడాలని ఆయన అన్నారు. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు అవసరమైన గడ్డిని పెంచేందుకు భూములను కౌలుకు ఇచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.30 వేలు కౌలు చెల్లించనున్నట్టు చెప్పారు. భూము లను కౌలుకి ఇస్తామని వ చ్చే రైతుల నుంచి దరఖా స్తులు స్వీకరించాలని తహ సీల్దార్‌కు సూచించారు. హ రిజన వాడలకు శ్మశానవా టికలు కావాలని కోరిన ప్రతి కాలనీకి భూములను గుర్తిం చాలన్నారు. అవసరమైతే భూములను కొనుగోలు చేసై నా శ్మశానవాటికలకు కేటా యించాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు. గ్రీ వెన్స్‌లో మొత్తం 72 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్ ఉష, డిప్యూటీ తహసీల్దార్ ధర్మతేజ, పీఏసీఎస్ చైర్మన్ పరిమి ఈశ్వరయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు వేమూ రి రామయ్య, నేరేడుపల్లి సర్పంచ్ పల్లా మల్లికార్జున్, పువ్వాడి నాగరాజు, పాల్గొన్నారు.