Share News

సాగునీరు కొరతలేకుండా చూడండి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:15 PM

సాగర్‌ కాలువ పరిధిలో పంటలు ఎండకుండా సాగుకు నీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

సాగునీరు కొరతలేకుండా చూడండి
మంత్రిని కలిసిన కొరిశపాడు మండల టీడీపీ నాయకులు

బల్లికురవ, నవంబరు16(ఆంధ్రజ్యోతి): సాగర్‌ కాలువ పరిధిలో పంటలు ఎండకుండా సాగుకు నీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ఇటీవల ముక్తేశ్వరం మేజర్‌ కాలువలో నాచు పెరిగి పంటలకు నీరు రావడం లేదని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. అయన ఆదేశాలతో కాలువను అభివృద్ధి చేశారు. ఆది వారం పనులు చేపట్టిన కాలువను రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అయన అన్ని మేజర్లలో పంటలకు సాగు నీటి ఇబ్బందులు రాకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఏబీసీకి నీరు ఎంతమేర వస్తుందో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అన్ని మేజర్లకు నీటి సరఫరా విడుదల చేయాలన్నారు. అలానే రామాంజ నేయపురం వద్ద ఏబీసీ కాలువపై శిథిలావస్ధకు చేరిన వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాల న్నారు. ముక్తేశ్వరం రామాంజనేయపురం గ్రామాల మధ్య మేజర్‌ కాలువపై ఉన్న వంతెనను మంత్రి పరిశీలించి వెంటనే నూతన వంతెన ఏర్పాటుకు ప్రతి పాదనలను పంపాలని ఆధికారులు ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేజర్‌ కాలువలను అభివృద్ధి చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ పరిశీలనలో మార్కెట్‌ యార్డు వైస్‌చైర్మన్‌ దేవినేని నరేంద్ర, టీడీపీ మండల అద్యక్షులు దూళిపాళ్ల హనుమంతురావు, పార్టీ నేతలు మలినేని గోవిందరావు, గొట్టిపాటి శంకర్‌, పోగుల చంద్రశేఖర్‌, కొండేటి ఇజ్రాయల్‌, మారాబత్తిన అంజనేయులు, కమతం మంగారావు, దద్దాల అంజయ్య, దివ్వె రామాంజనేయులు, అట్లూరి నాగేశ్వర రావు, ఎన్‌ఎస్పీ డీఈ లక్ష్మీనారాయణ, జేఈ ప్రతిమ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ గిరినాయక్‌, పంచాయతీ కార్యదర్శి షేక్‌ మీరావలి తదితరులు పాల్గొన్నారు.

మేదరమెట్ల : టీడీపీ అభివృద్ధికి అందరూ ఐక్యమత్యంతో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఆదివారం నూతనం గా ఎన్నికైన నూతన కమిటి, టీడీపీ మండల నాయ కులు చిలకలూరిపేటలోని మంత్రి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామాల వారి పార్టీ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ఇక విభేదాలు లేకుండా గ్రామాలల్లో పనిచేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శింబోతు సత్యనారాయణ, మొపర్తి లక్ష్మినారాయణ, గండే హేస్కేల్‌, ఏడెం భవాని ప్రసాద్‌రెడ్డి, చెన్నుపాటి హరి బాబు, చింతం సుబ్బారావు, నాదెండ్ల కోటేశ్వరరావు, ఈదా సుబ్బారెడ్డి, కోట్టే రవీంద్ర, మందా నాగేశ్వరరావు, శానం వెంకటేశ్వర్లు, కరిచేటి రాంబాబు, రావూరి సుందరబాబు, మందా ఆమోస్‌ తదితరులు ఉన్నారు.

పంగులూరు : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ రామకూరు గ్రామంలో ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ నెల 4న విద్యుత్‌షాక్‌తో మృతిచెందిన టీడీపీ కార్యకర్త షేక్‌ మహమ్మద్‌వలి కుటుంబాన్ని మంత్రి గొట్టిపాటి పరామర్శించారు. ఇదే గ్రామంలో విద్యుత్‌షాక్‌కు గురై చికిత్స పొందుతున్న దొడ్డక అభిరామ్‌ ఆరోగ్యపరిస్దితి అడిగి తెలుసుకున్నారు. కాలికి శస్త్రచికిత్స చేయించు కున్న మిన్నెకంటి మస్తానరావును పరామర్శించారు. అనంతరం గ్రామ ప్రధానకూడలిలో టీ దుకాణంలో టీ తాగుతూ ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. పక్కా ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వ సాయం అందించాలని, కొండపైకి వెళ్లే రహదారిలో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయించాలని గ్రామస్థులు కోరారు. దీంతో రహదారి వెంబడి విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మానం సుబ్బారావు, తొట్టెంపూడి చంద్రశేఖర్‌, ఉపసర్పంచ్‌ పెడవల్లి అశోక్‌, కార్యదర్శి శిరీష, ఈఈ మస్తానరావు, పలువురు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:15 PM