ప్రజాదర్బార్‌లో ప్రజాసమస్యల పరిష్కారం
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:52 PM
నిరంతరం ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలను ఎమ్మెల్యే ముత్తుముల దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నిరంతరం ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలను ఎమ్మెల్యే ముత్తుముల దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు ఆ అర్జీలను పంపుతూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చే వినతలను పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫించన్లు, ఇళ్ళ స్థలాలు, రెవిన్యూ, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఎదరవుతున్న ఇబ్బందులపై వచ్చిన విజ్ఞప్తులను ఆయన స్వయంగా స్వీకరించి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.