Share News

నల్లవాగుపై వంతెనకు మరమ్మతులు

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:53 AM

నామ్‌ రోడ్డులో అద్దంకి పట్టణానికి సమీపంలోని నల్ల వాగు వంతెనకు మరమ్మతులు చేస్తున్నారు.

నల్లవాగుపై వంతెనకు మరమ్మతులు

అద్దంకి, ఆగస్టు10 (ఆంధ్రజ్యోతి): నామ్‌ రోడ్డులో అద్దంకి పట్టణానికి సమీపంలోని నల్ల వాగు వంతెనకు మరమ్మతులు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన రెండు దశాబ్దాల క్రితం కుంగింది. అప్పట్లో మరమ్మతులు చేసి రాక పోకలు పునరుద్ధరించారు. అనం తరం నామ్‌ రోడ్డు నిర్మాణ సమ యంలో పాత వంతెన తొలగించ కుండా, ఒక వైపు రాకపోకలకు ఈ వంతెనను వినియోగి స్తున్నారు. కొత్తగా నిర్మిం చిన మరో వంతెనపై మరోవైపు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాత వంతెన దెబ్బ తింది. దీంతో నామ్‌ రోడ్డు నిర్వ హణ సంస్థ తాత్కాలిక మరమ్మ తులు ప్రారంభించింది. దీంతో వాహనాలు రాకపోకలను ఒకే మార్గంలో సాగేలా డైవర్షన్‌ ఏర్పాటు చేశారు. సుమారు 4 దశాబ్దాల క్రితం నాటి వంతెన కావడం, నిత్యం నామ్‌ రోడ్డు లో భారీ వాహనాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో పాత వంతెన స్థానంలో కొత్తదాన్ని నిర్మించాలని, వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:53 AM