నిల్వ ఉన్న నీరు తొలగింపు
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:01 PM
మండలంలోని ఆకవీడు గ్రామ ప్రధాన రహదారిలో నిల్వ ఉన్న వర్షపు నీటిని అధికారులు ఎట్టకేలకు తొలగించి సమస్యను పరిష్కరించారు.
రాచర్ల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఆకవీడు గ్రామ ప్రధాన రహదారిలో నిల్వ ఉన్న వర్షపు నీటిని అధికారులు ఎట్టకేలకు తొలగించి సమస్యను పరిష్కరించారు. ప్రధాన రహదారిపై వాన నీటితో ఇబ్బందులు శీర్షికన ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై ఎంపీడీవో ఎస్ వెంకటరామిరెడ్డి స్పందించి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శివ రామకృష్ణ, బాలస్వామి, పంచాయతీ రాజ్ ఏఈ రంగస్వామిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఏఈ నరేష్ రెడ్డి, స్థానిక నాయకులు లక్ష్మీరెడ్డి, జయచంద్రారెడ్డి, లింగన్న, ఎర్రపిచ్చయ్య పాల్గొన్నారు. సమస్య పరిష్కరించిన అధికారులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.